ఎన్‌పీఆర్‌ పై సీఎం జగన్ డిప్లమాటిక్ డెసిషన్

cm jagan diplomatic decission on NPR

దేశ జనాభా పట్టిక ఎన్‌పీఆర్ పై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్ చేసిన ఈ ప్రకటన వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.  రాబోయే  అసెంబ్లీలో సమావేశాల్లో ఎన్‌పీఆర్‌ అంశంపై తీర్మానం చేస్తామని సీఎం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఎన్‌పీఆర్‌లో పొందుపరిచిన పలు ప్రశ్నల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని మైనారిటీలలో అభద్రతా భావం ఏర్పడుతోందని పేర్కొన్నారు. దీనిపై పార్టీ వర్గాలతో చర్చించిన తర్వాత,  2010లోని జనాభా పట్టికలోని అంశాలనే తిరిగి పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.అలా కుదరని నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే ఎన్‌పీఆర్‌పై ప్రకటన చేసిన సీఎం జగన్, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ల గురించి ప్రస్తావించలేదు. వాస్తవానికి  సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ఏపీలో వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. సొంత పార్టీ మైనార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని జగన్ దగ్గర సీరియస్‌గా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

cm jagan diplomatic decission on NPR,NPR, CAA, NRC, CM Jagan , jagan mohan reddy , andhra pradesh , minority leaders

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article