ఏ పరిణామాలు సీఎంను బాధించాయ్?

cm jagan feels about legislative council decision

శాసన మండలి రద్దు చేస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై వైసీపీ చర్చిస్తుంది.  నిన్న రాజధాని వికేంద్రీకరణ బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకపోవటంతో షాక్ కు గురైన వైసీపీ సర్కార్ ఎలాగైనా శాసన మండలి రద్దు చేసి తీరాలని భావిస్తుంది. ఇక ఈ నేపధ్యంలో నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాలు తన మనసును ఎంతగానో బాధించాయని ఏపీ సీఎం జగన్ అన్నారు. కొన్ని అంశాలను సభ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకువస్తున్నానంటూ మాట్లాడిన జగన్  ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో తాము గెలిచామని, ‘ఇది ప్రజల సభ, ప్రజలు ఆమోదించిన సభ’, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పడ్డ సభ అని, చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభ అని అన్నారు. ‘మండలి’ అన్నది చట్టసభలో భాగం కనుక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మామని, తన నమ్మకంతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నిన్న శాసనమండలిలో జరిగిన తంతును అందరూ గమనించారని జగన్ ఆక్రోశంగా మాట్లాడారు .

శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిష్పక్షపాతంగా సభను నిర్వహించే పరిస్థితి లేదని అన్నారు. నిన్న గ్యాలరీలో చంద్రబాబు కూర్చుని జారీ చేసిన ఆదేశాలను చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమౌతుందని  విమర్శించారు. శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చని, లేకపోతే, సవరణలు కోరుతూ తిప్పి పంపించవచ్చు అని, చట్టం కూడా ఇదే విషయాన్ని చెబుతోందని అన్నారు. కానీ, వాటిని లెక్క చేయకుండా విచక్షణా అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారని మండిపడ్డారు సీఎం జగన్ మోహన్ రెడ్డి .

cm jagan feels about legislative council decision,AP council ,  capital decentralization bill, ycp ministers ,  chairman shareef ,CM Jagan mohan reddy , revoke,  chandrababu 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *