CM Jagan visakha Tour ToDay
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏపీ లోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు అయన ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి విశాఖకు బయలుదేరనున్నారు. అనంతరం అయన 3.50కి కైలాసగిరి చేరుకొని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక అక్కడ పనులు ముగించుకుని సాయంత్రం 4.40కి వైఎస్సార్ సెంట్రల్ పార్క్ కు చేరుకుంటారు అక్కడ కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి సాయంత్రం 5.30కి ఆర్కేబీచ్ కి చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.40కి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్.