దణ్ణం పెట్టినా కరోనా రాదు.. రానివ్వం…

CM KCR Excellent Speech About CoronaVirus In Assembly
చైనాలో పుట్టి ప్రరంచాదేశాలకు వ్యాప్తి చెంది ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్ .  కరోనా వైరస్ ఇతర దేశాలలోనూ తన ప్రభావాన్ని చూపిస్తున్నా మనకు మాత్రం అంత ఎఫెక్ట్ ఉండదని చెప్తున్నారు తెలంగాణా సీఎం కేసీఆర్ . భారతదేశంలో ఇప్పటివరకు 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చింది. ఇక్కడ కరోనా వైరస్ బతకదని ఎవరూ భయపడాల్సిన పని  లేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేస్తూ పేర్కొన్నారు.
ఇక, తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినా అది ఇక్కడ జరిగింది కాదు. ఇక, గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానం ఇస్తూ సీఎం కేసీఆర్.. కరోనా వైరస్ గురించి మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదు అని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్‌పై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కరోనా రావొద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్న సీఎం కేసీఆర్  రాష్ట్రానికి  కరోనా వైరస్‌ రాదు.. రానివ్వం కూడా అని తేల్చిచెప్పారు. దణ్ణం పెట్టి రమ్మన్నా రాదనీ పేర్కొన్నారు. ఈ వైరస్‌ ఇక్కడ పుట్టింది కాదు.. ఒక వేళ వచ్చినా రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే ఆ వైరస్‌ను అడ్డుకుంటామని ప్రకటించారు సీఎం. భారతదేశంలో కరోనా పాజిటివ్ అని తేలిన 31 మంది కూడా ఇతర దేశాలకు వెళ్లివచ్చిన వారేనన్న కేసీఆర్ మన రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకు? అని ప్రశ్నించారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్‌ బతకదన్న ఆయన మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది అలాంటప్పుడు ఆ వైరస్‌ ఎలా బతుకుతుందని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

CM KCR Excellent Speech About CoronaVirus In Assembly,corona virus , telangana, corona positive , assembly budget session , governor speech , india , cm kcr 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *