రెవెన్యూ శాఖకు షాక్ ఇవ్వటానికి రెడీ….

136
Corona Cases In 4 Districts Only
Corona Cases In 4 Districts Only

cm kcr ready for gives shock to revenue department

రెవెన్యూ శాఖ‌ ప్ర‌క్షాళ‌న చేయాల‌ని  ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పటి నుండో భావిస్తున్నారు.  . అత్యధికంగా అవినీతి ఆ శాఖ‌లోనే జ‌రుగుతోంద‌ని ఆయ‌నే స్వ‌యంగా వ్యాఖ్యానించిన సంద‌ర్భాలూ ఉన్నాయి. జీతం వ‌స్తోంది చాల‌దా, అవినీతి సొమ్ము ఏం చేసుకుంటారు అంటూ అడిగిన సందర్భాలు కూడా లేకపోలేదు . ఈ నేపధ్యంలో  రెవెన్యూ శాఖ విష‌యంలో కేసీఆర్ ఆలోచ‌న ఎంత క‌ఠినంగా ఉండ‌బోతోంద‌నే సంకేతాలు ఆయ‌న ముందు నుంచీ ఇస్తూనే ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే కొత్త రెవెన్యూ చ‌ట్టం రూప‌క‌ల్ప‌న కూడా తుదిద‌శ‌కు చేరుకున్న‌ట్టు తెలుస్తోంది. దీన్లో భాగంగా ఈనెల 11న క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్లో ముఖ్యమంత్రి స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టం అమ‌లు సాధ్యాసాధ్యాల‌పై ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఒక అధ్య‌య‌నం చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చ‌ట్టానికి తెలంగాణ భూచ‌ట్టం అని నామ‌క‌ర‌ణం చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఈనెల‌లో అసెంబ్లీ స‌మావేశాలున్నాయి. ఈలోగా కొత్త చ‌ట్టానికి తుది మెరుగులు దిద్ది, స‌భ‌లో ఆమోదింప‌జేసుకోవాలన్న‌ది ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.
క్షేత్ర‌స్థాయి రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లోనే అత్య‌ధికంగా అవినీతి జ‌రుగుతోంద‌నీ, దీన్ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేయాల‌ని సీఎం భావిస్తున్నార‌ని సమాచారం . క్షేత్ర‌స్థాయిలో అధికారుల‌తోపాటు ఇత‌రుల జోక్యం రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో ఉంటోంద‌నీ, ఒక సామాన్యుడు భూముల‌కు సంబంధించి ఏ చిన్న మార్పులూ చేర్పులూ చేయించుకోవాల‌న్నా లంచాలు ఇవ్వాల్సి వ‌స్తోంద‌నీ, ఈ ప‌రిస్థితిని మార్చాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌. వీఆర్వో, వి.ఆర్.ఎ.లు సేవ‌ల‌పై కూడా సీఎం అధ్య‌య‌నం చేస్తున్నారు. వీరిని కొన‌సాగించాలా, ర‌ద్దు చెయ్యాలా, వేరే ఏదైనా శాఖ‌లో వీళ్ల‌ను విలీనం చేసి సేవ‌ల్ని వినియోగించుకోవచ్చా అనేది కూడా ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం.  ఏకంగా కొన్ని శాఖ‌ల‌నే లేకుండా చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని అధికార వ‌ర్గాలూ అంటున్నాయి. మరి రెవెన్యూ శాఖ మీద ఎప్పటి నుండో కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ త్వరలో రెవెన్యూ ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్నారని సమాచారం .

cm kcr ready for gives shock to revenue department,#revenuedepartment , telangana, #cmkcr, corruption, bribe, study , new revenue act , revenue employees

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here