ఆంధ్ర వారు దందాగిరి?

756
CM KCR Responds over water Dispute
CM KCR Responds over water Dispute

కృష్ణా నీళ్లపై ఆంధ్ర వారు దందాగిరి చేస్తున్నార‌ని సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. సాగర్ నియోజకవర్గంలో ఉన్న పెద్దదేవులపల్లి రిజర్వాయర్ కు పాలేరును అనుసంధానం చేస్తే ఇక నీళ్లకు ఏ ఢోకా ఉండదు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసినం.. దానిలో సిబ్బంది, భవనాల నిర్మాణం మంజూరు చేస్తున్నాం… మినీ స్టేడియం నిర్మాణం చేస్తాం.. ఆర్ అండ్ బి రోడ్లు.,PR రోడ్లకు అన్ని కలిపి 120 కోట్లు మంజూరు చేస్తున్నాం.. టోటల్ గా నియోజకవర్గనికి 150 కోట్లు మంజూరు చేస్తున్నాని కేసీఆర్ వెల్ల‌డించారు. సాగర్లో రెడ్డి కల్యాణ మండప నిర్మాణంకి జాగా ఇస్తామ‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపిస్తాన‌ని.. అవసరమైతే మళ్ళీ సాగర్ కు వస్తాన‌ని తెలిపారు. దామరచర్ల లో 30 వేల కోట్లతో అల్ట్రా పవర్ థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేస్తున్న‌మ‌ని వెల్ల‌డించారు. జిల్లాకే గర్వకారణం ఈ పవర్ ప్లాంట్ అని.. మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టి దామరచర్లలో నెలకొల్పేలా చేసిండ‌ని చెప్పారు. ప్లాంట్ నిర్మాణంతో నల్గొండ జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసుకున్నాం.. సాగర్ లో బంజారా భవన్ ను నిర్మిస్తామ‌న్నారు. పోడు భూములు సమస్యకు పరిష్కారం చూపెడతామ‌ని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో 12,796 గ్రామాల్లో పల్లె ప్రగతి అద్భుతమైన మార్పు తీసుకొచ్చింద‌ని.. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టామ‌న్నారు.
హరితహారంని అందరూ విజయవంతం చేయాలి.. 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిచి అల్ టైం హయ్యస్ట్ రికార్డ్ సాధించినం.. తెలంగాణలో మ‌న్నికైనా, నాణ్యతా పత్తిని పండిస్తునం.. అది మనకు గర్వకారణం.. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం.. నాగార్జున సాగర్ ప్రజలు చైతన్యం చూపెట్టి టీఆర్ఎస్ ను గెలిపించారు.. సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తా.. రూ.150 కోట్లును వెంటనే మంజరు చేస్తున్న….70 ఏండ్ల‌ స్వతంత్ర భారతంలో దళితులు వెనకబడి వున్నారు.. దళిత బంధు కోసం లక్ష కోట్లు అయిన ఖర్చు చేస్తా.. కేసీఆర్ చెప్పిండు అంటే అది శాసనమే.. దళిత బంధు కూడా అంతే.. అమలు చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతా..

*దళిత బంధు పై ప్ర‌తిప‌క్షాలు అనుమానాలు, అపోహల్ని సృష్టిస్తున్నారు. వాళ్లకు బాధ్యత లేదు. 12 లక్షల మంది దళిత కుటుంబాల అందరికి 10 లక్షల రూపాయలను దళిత బంధు పథకం కింద మంజూరు చేస్తాం.. వాళ్ళు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటా.. దళితుల్ని ఎవ్వరు పట్టించుకులే.. దళిత బంధు అనగానే ప్రతిపక్షాలకు గుండె దడ మొదలయింది… ఇక తమకు పుట్టగతులుండ‌వ‌ని ప్రతిపక్షాలు బెంబోలెత్తిపోతున్నాయి.. ఆరు నూరైన దళిత బంధు అమలు చేసి చూపిస్తా.. ఆనాడు తెలంగాణ తెస్తా ఆంటే కూడా నమ్మలే.. ఈ దద్దమ్మలు సమాఖ్య పాలకుల సంచులు మోసినరు.. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినరు.. వీల్లా ఇవ్వాళ మాట్లాడేది.. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పాలి.. 3 కోట్ల వరి ధాన్యాన్ని పండించి నా తెలంగాణ సగర్వంగా నిలబడ్డది.. నాకు గుండె నిండా సంతోషం తొణికిసలాడుతున్నది..ప్రతిపక్షాలు మాట్లాడే అవాకులు చవాకులు పట్టించుకోవద్ద‌ని హితువు ప‌లికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here