ఇంట్రెస్టింగ్…ఒకేవేదికపై సీఎం కేసీఆర్, రేవంత్

114
CM KCR & Revanth To Inaugurate JBS - MGBS Metro Route
CM KCR & Revanth To Inaugurate JBS - MGBS Metro Route

CM KCR & Revanth To Inaugurate JBS – MGBS Metro Route

సీఎం కేసీఆర్ , రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపిస్తే .. పక్క పక్కనే ఉంటె రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్యుల్లోనూ ఆసక్తి ఉంటుంది.  రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా బద్ధ శత్రువులుగా కనిపించే కేసీఆర్ రేవంత్ లు   శుక్రవారం హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా జేబీఎస్- ఎంజీబీఎస్ ల మధ్య ఏర్పాటైన మార్గాన్ని ప్రారంభించే కార్యక్రమలో పాల్గొన్నారు .  సీఎం హోదాలో కేసీఆర్  మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా జేబీఎస్- ఎంజీబీఎస్ ల మధ్య ఏర్పాటైన మార్గాన్ని ప్రారంభించారు. జేబీఎస్ స్టేషన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం హోదాలో కేసీఆర్ హాజరైతే… స్థానిక ఎంపీగా (మల్కాజిగిరీ ఎంపీ) హోదాలో రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేసీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ కేటీఆర్ తలసాని శ్రీనివాస యాదవ్. శ్రీనివాస గౌడ్ లు హాజరు కాగా.. లోకల్ ఎంపీ హోదాలో రేవంత్ రెడ్డి , సీఎం కేసీఆర్ ఒకేచోట ఆ కార్యక్రమంలో పాల్గొనటం ఆసక్తి కలిగించే అంశం .

కేసీఆర్ రిబ్బన్ కట్ చేస్తుంటే… ఆయన పక్కన సికింద్రాబాద్ ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తూము పద్మారావు గౌడ్ నిలుచుంటే… ఆ పక్కనే రేవంత్ రెడ్డి నిలుచున్నారు. అంటే… కేసీఆర్ రేవంత్ ల మధ్యలో పద్మారావు మాత్రమే ఉన్నారు.  కేసీఆర్ కూ తనకూ మధ్యలో నిలుచున్న పద్మారావు చేతిలో చెయ్యేసి మరీ రేవంత్ కనిపించారు. కేసీఆర్ , రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకరి మీద నిప్పులు చెరుగుతూనే ఉంటారు. అలాంటి వారిద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనటం విశేషమే

CM KCR & Revanth To Inaugurate JBS – MGBS Metro Route,cm kcr, metro rail project, jbs and mgbs, revanth reddy , inauguration , trs party , congress party

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here