కూలిన ఇళ్లకు రూ.లక్ష పరిహారం

26
Cm Kcr review on destroy houses
Cm Kcr review on destroy houses

Cm Kcr review on destroy houses

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కుటుంబాలను, ముంపునకు గురైన ఇండ్ల బాధితులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. కూలిన ఇళ్లకు రూ. లక్ష పరిహారం, ముంపు ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ అన్నారు. వర్షాల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోతే రూ.లక్ష, కొంతమేరకు దెబ్బతింటే రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. దెబ్బతిన్న రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, పేదలకు సహాయం చేయడానికి పురపాలక శాఖకు రూ.550 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.

ఎన్నడూలేనంతగా వర్షాలు వచ్చావని, రికార్డు స్థాయిలో వర్షాలు పడటం వల్ల చాలామంది నిరుపేదల, బస్తీలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి.. మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని, ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here