అబ్ కీ బార్ కిసాన్ సర్కార్

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్

సీఎం కేసీఆర్‌

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. ఇదే నినాదంతో దేశం ముందుకు బీఆర్ఎస్ పార్టీ వెళుతుంద‌ని భారత రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో మాట్లాడుతూ.. దేశ పరివర్తన కోసమే బీఆర్ఎస్ పార్టీ ప‌ని చేస్తోంది.. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు, రాజకీయ పార్టీలు కాదు.. దేశానికి ఇప్పటికిప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరం.. ఢిల్లీ ఎర్రకోటపై ఎగరేది గులాబీ జెండానే అని కేసీఆర్ అన్నారు. ఈ నెల 14న సర్దార్ పటేల్ మార్గ్ లోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. జాతీయస్థాయిలో కొత్త పర్యావరణ విధానం అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇకపై రాష్ట్రాల మధ్య జల యుద్దాలు ఉండవని ప్ర‌క‌టించారు. త‌న ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వ సాధారణమ‌ని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేద‌న్నారు. అలాంటి అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించి తెలంగాణాను సాధించామ‌ని చెప్పారు. కర్ణాటక – తెలంగాణా సరిహద్దుల్లో అనేకమంది తెలుగువాళ్లు ఉన్నారని.. వాళ్ల కోసం బీఆర్ఎస్ కృషి చేస్తోంది. అక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లోకి బీఆర్ఎస్ దిగుతుందని ప్ర‌క‌టించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article