హుజూర్ నగర్ లో నేడు సీఎం కృతజ్ఞత సభ

153
Cm kcr thanks giving meeting in huzurnagr
Cm kcr thanks giving meeting in huzurnagr

Cm kcr thanks giving meeting in huzurnagr

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపి హుజూర్నగర్ లో గులాబీ జెండా రెపరెపలాడించారు. కాంగ్రెస్ కంచుకోట అయిన హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని అత్యంత భారీ మెజారిటీతో టిఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. గత డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు. అయితే అనంతరం ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో ఈ నెల 21వ తేదిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. అయితే మొన్న వెలువడిన ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక హుజూర్నగర్ ప్రజలు సీఎం కేసీఆర్ ను, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించి అందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ నేడు కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. సీఎం కెసిఆర్ కృతజ్ఞత సభ నేపథ్యంలో హుజూర్నగర్ ప్రజలు సీఎం తమ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తారని బోలెడు ఆశతో ఉన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికకు ప్రచారానికి వెళ్లాలని, అక్కడ భారీ బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడాలని అనుకున్నప్పటికి వర్షం కారణంగా సభ రద్దైన సంగతి తెలిసందే. అయితే మొన్న ఫలితం వెలువడిన రోజునే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా హుజూర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ కట్టబెట్టినందుకు నేడు హుజూర్‌నగర్‌లో ప్రజా కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. అయితే మొదటి సారి ఇక్కడ టీఆర్ఎస్ గెలుపొందడంతో సీఎం కేసీఆర్ ఇక్కడ హామీల వర్షం కురిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి సీఎం కేసీఆర్ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజల మీద ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో ..

tags : huzur nagar, cm kcr, trs won, thanks giving meet, public meeting, congress

సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్

తెలంగాణ బోటు ప్రమాద మృతులకు ఏపీ పరిహారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here