ఢిల్లీలో ట్రంప్ తో విందులో కేసీఆర్

CM KCR To Attend Dinner With Donald Trump

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో ట్రంప్ తో కలిసి విందులో పాల్గొననున్నారు .భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఏర్పాటు చేసిన విందుకు కేసీఆర్‌ హాజరుకానున్నారు. సోమవారం రాత్రి తన వ్యవసాయ క్షేత్రం నుంచి సీఎం హైదరాబాద్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ విందుకు కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, తమిళనాడు, అసోం, బిహార్, హరియాణా రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చేందుకు కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేశారు. పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్‌ మెమెంటోను కేసీఆర్ అందించనున్నారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన పోచంపల్లి, గద్వాల్‌ చీరలను.. మెలానియా, ఇవాంకకు బహూకరించేందుకు కేసీఆర్ స్పెషల్‌గా తయారు చేయించారు. గతంలో కూడా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇవాంకకు కేసీఆర్ ప్రత్యేక బహుమతి అందజేశారు.

CM KCR To Attend Dinner With Donald Trump,telangana, cm kcr,#trump,dinner, president, ramnath kovind, special gifts , delhi,#kcrdinnerwithtrump

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article