సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

188
CM KCR wishes to Indian athletes
CM KCR wishes to Indian athletes

జపాన్ దేశం టోక్యోలో నేటి నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి శాంతి సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతిరూపంగా నిలుస్తాయని సిఎం అభివర్ణించారు. ఒలింపిక్స్ క్రీడల్లో విజయాలు సాధించి, స్వర్ణాలతోపాటు పలు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం జరగాలని సిఎం కోరుకున్నారు. భారతదేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోసారి ఎగరేయాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here