ఇకపై ఏపీలో ఆటో మ్యుటేషన్‌ సేవలు

139
CM launches auto mutation services
CM launches auto mutation services

CM launches auto mutation services

భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్‌) ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది . ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు . ఆటో మ్యుటేషన్‌ సేవల పోస్టర్‌ను ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ విడుదల చేశారు. .ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో తహసీల్దారు కార్యాలయం చుట్టు గానీ, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వుంది. ఇక అలాంటి పరిస్థితికి స్వస్తి చెప్పాలని భావించిన సర్కార్  ఈ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం పెరిగిందని భావించిన ప్రభుత్వం ఆటోమ్యుటేషన్ విధానాన్ని తీసుకువచ్చింది. రిజిస్ట్రేషను చేసిన భూముల వివరాలు రెవెన్యూ రికార్డులలో సత్వరం మార్చడానికి ఆటో మ్యుటేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. ఈ భూమార్పిడి వివరాలను మీభూమి పబ్లిక్‌ పోర్టల్‌ (www.meebhoomi.ap.gov.in ) లో సరిచూసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు.ఆటో మ్యుటేషన్‌ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఆటో మ్యుటేషన్‌ వల్ల ఉపయోగాలు చాలా వున్నాయని, భూ రిజిస్ట్రేషన్‌ మొదలుకుని ఈ-పాసుబుక్‌ జారీ వరకు ఆన్‌లైన్‌లోనే మొత్తం ప్రక్రియ జరుగుతుందని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఇకపై పట్టాదారులు ఆన్‌ లైన్‌ భూ బదలాయింపు కోసం మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం వుండదు.భూ బదలాయింపు ప్రక్రియ ప్రతి దశలో పట్టాదారు మొబైల్‌ నంబరుకు సంక్షిప్త సమాచారం ద్వారా తెలిసిపోతుంది.

CM launches auto mutation services,auto mutation, mee bhoomi , andhra pradesh , ys jagan mohan reddy , public portal , land records, online,Auto-mutation of land records

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here