నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

60

నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతుందని.. నకిలీ విత్తనాలు విక్రయిస్తూ దొరికితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు హాకా భవన్ లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 1966 లో రూపొందించిన కేంద్ర ప్రభుత్వ విత్తన విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయని.. విత్తన చట్టాల బలోపేతానికి కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని.. నకిలీ విత్తనాలను ఉపేక్షించే పరిస్థితి లేదని తెలిపారు. దేశంలో నకిలీ విత్తన తయారీ దారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. ప్రధానంగా పత్తి, మిరప నకిలీ విత్తనాలపై ప్రధాన దృష్టి సారిస్తున్నామని చెపన్పారు. ఇప్పటికే ఈ సీజన్ లో 177 కేసులు నమోదు చేసి 276 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. 3468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశామని.. విత్తనాల లైసెన్సింగ్ విధానం పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం

  • విత్తన లైసెన్సుల జారీకి కాలపరిమితిని నిర్దేశించి నిర్ణీత సమయంలో ఇవ్వాలని మంత్రి సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రేపు క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఈ సమీక్షలో ఐజీ నాగిరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బాలు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here