తనను చంపేందుకు సీఎం కుట్ర చేస్తున్నాడని కన్నా సంచలనం

CM trying to kill me by sensational comments by Kanna

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. తనను హత్య చేయించడానికి తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోందంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. అందుకోసమే టిడిపి నాయకులు, కార్యకర్తలు ధర్నా పేరుతో తన ఇంటి వద్దకు వచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
గతంలో బిజెపి జాతీయాధ్యక్షులు అమిత్ షా, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లపై కూడా ఇలాగే హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు. అదే మాదిరిగా తనపై కూడా హత్యాప్రయత్నం జరపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి బహిరంగంగానే బిజెపి నాయకులను పినిష్ చేస్తానంటున్నాడని కన్నా గుర్తు చేశారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు పిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దీనిపై దృష్టిపెట్టాలని కన్నా సూచించారు.
కాకినాడలో పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయిని బీజేపీ నేతలు అడ్డుకోలేదని…కేవలం వినతిపత్రం సమర్పించడానికి ప్రయత్నించారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి పోలీసుల చేత తమ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయించారని అన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ.. టీడీపీ నేతలు శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బిజెపి నేతలు కూడా అక్కడికి చేరుకుని టిడిపికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మోదీ, కన్నాకి మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నేతల ఆందోళనలతో కన్నా ఇంటివద్ద ఉద్రిక్తంగా చోటుచేసుకుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article