CM YS Jagan Christamas Shedule
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన రెడ్డి మూడు రోజుల పర్యటన చేపట్టనున్నారు. కడప జిల్లాలో అయన పర్యటనలో భాగంగా జిల్లాలో అభివృద్ధి పనులకు వైస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక ప్రజలతో మాట్లాడనున్నారు. జిల్లాలో సమస్యలను తెలుసుకోనున్నారు. ముఖ్యంగా కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం పునాదిరాయి వేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఓ ప్రణాలికను తయారుచేశారు. ఎక్కడెక్కడ సీఎం పర్యటన ఉంటుంది?సమయం, తదితర అంశాలను సీఎంఓ తేల్చనుంది. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయ్.
23వ తేదీ సోమవారం
– ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు సీఎం శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ
– రిమ్స్ లో వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
– వైఎస్ఆర్ ఉచిత భోజన వసతి భవనం ప్రారంభం
– రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం
24 మంగళవారం రోజున ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌కు చేరుకొని వైస్సార్ కి నివాళులు అర్పిస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసుకుని ఇడుపులపాయలో నివాసానికి వెళ్తారు సీఎం.
25వ తేదీ బుధవారం రోజున అంటే క్రిస్మస్ పండుగ రోజున పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్ధనలో పాల్గొంటారు. అనంతరం పులివెందుల జూనియర్ కళాశాల మైదానంలో పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అక్కడ పని ముగిశాక తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.