ఒక సోద‌రునిగా జ‌గ‌న్ విందుకు ఆహ్వానించారు

చిరంజీవి ఒక్క‌రినే విందుకు జ‌గ‌న్ ఆహ్వానించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇది చిరును కూడా ఎగ్జ‌యిట్‌మెంట్‌కు గురిచేసింది. “ఒక సోద‌రునిగా ఆయ‌న న‌న్ను విందు భోజ‌నానికి ఆహ్వానించి, ఆయ‌న నాతో సంభాషించిన తీరు కానీ, ఆత్మీయ‌త‌ను క‌న‌పర్చిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. ద‌గ్గ‌రుండి శ్రీ‌మ‌తి భార‌తిగారు వ‌డ్డించ‌డం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంత ఆప్యాయ‌త క‌న‌ప‌ర్చిన ఆ ఇద్ద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.” అని ఎగ్జ‌యిట్ అవుతూ చెప్పారు చిరు.

“ఇప్పుడు నేను ఒక్క‌డ్ని అనుకొని రాలేదు, న‌న్ను ఒక్క‌డ్ని ర‌మ్మ‌ని ఆయ‌న భోజ‌నానికి ఆహ్వానిస్తే వ‌చ్చాను. ప్ర‌భుత్వం, ఇండ‌స్ట్రీ మ‌ధ్య నెల‌కొన్న వివాదానికి ఫుల్‌స్టాప్ ప‌డుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది” అని ఆయ‌న‌న్నారు. ‘ఈసారి ఎప్పుడొచ్చినా భోజ‌నానికి క‌లుద్దామ‌న్నా’ అని జ‌గ‌న్ చెప్పార‌న్నారు. “అంత ఆప్యాయంగా సొంత‌మ‌నిషిగా న‌న్ను చూస్తున్నందుకు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు.” అని చెప్పారు చిరు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article