మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా

కోవిడ్‌ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు. మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు
దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గరనుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే
ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలు
అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ఆదేశాలు
ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసిపంపినా జరిమానాలు విధింపు
దీనికోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు
ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలు. మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలు
మార్కెట్‌కమిటీలు మాస్క్‌లు ధరించేలా చూడాలంటూ ఆదేశాలు. అన్నిజిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ సడలింపు
రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేత, 10 గంటలతర్వాత అమల్లోకి కర్ఫ్యూ ఆంక్షలు
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article