CM YS Jagan speech at 3rd Phase Of ‘YSR Kanti Velugu
కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్. ఇక ఆయన ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా ఉచితంగా వైద్యం చేయించే చికిత్స ఉంది.. కానీ.. అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదన్నారు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది..కానీ.. చెడు దృష్టికి మాత్రం ఎక్కడా చికిత్స లేనే లేదన్నారు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి.. కానీ.. మెదడు కుళ్లితే మాత్రం.. చికిత్సలు లేనే లేవు అని సెటైర్లు వేశారు . ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషులను.. మహానుభావులుగా చూపించే కొన్ని చానళ్లు, పత్రికలు ఉన్నాయన్న సీఎం జగన్.. వాళ్లను బాగు చేసే మందులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. వీటన్నింటి మధ్య మీ బిడ్డగా మీకోసం పని చేస్తున్నా అని సీఎం చెప్పారు. నిజాయితో పని చేస్తున్నామన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నామన్నారు.
సీఎం జగన్ కర్నూలు నుంచి రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 3వ దశ కంటి వెలుగును కర్నూలు నుంచి ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు సీఎం జగన్. అవ్వా తాతలకు ఎంత చేసినా తక్కువే అన్నారు సీఎం జగన్. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు జగన్ చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేస్తామన్నారు జగన్. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని పీహెచ్ ప్రమాణాలకు తీసుకొస్తామన్నారు.జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రూ.15వేల 337 కోట్లతో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. 3వ దశలో 56.88 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తామన్నారు.