అమెరికాలో చెలరేగిన చలిగాలులు

COLD WAVES IN AMERICA

  • మైనస్ 66 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • 21 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో చలిగాలులు చెలరేగిపోతున్నాయి. శీతాకాలంలో చల్లగా ఉండే దేశం ఈసారి ఏకంగా గడ్డ కట్టుకుపోతోంది. పోలార్‌ వొర్టెక్స్‌ ప్రభావం కారణంగా ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులతో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోయాయి. మిన్నెసోటాలో ఏకంగా మైనస్ 66 డిగ్రీల ఫారిన్ హీట్ నమోదైంది. అత్యంత శీతల గాలులు కారణంగా ఇప్పటివరకు 21 మంది మృతిచెందారు. ఇంతటి తీవ్రమైన చలి ఎన్నడూ లేదని అంటున్నారు. ఆరుబయట కొంచెం ఎక్కువ సేపు ఉన్నా ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. గట్టిగా శ్వాస పీల్చుకోవద్దని, గట్టిగా మాట్లాడవద్దని అధికారులు జాగ్రత్తలు చెబుతున్నారు. చలిగాలులు కొనసాగుతుండటంతో జనజీవనం దాదాపు స్తంభించింది. మధ్య పశ్చిమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా అంటార్కిటికా ధృవం కన్నా తక్కువగా మైనస్‌ డిగ్రీలకు పడిపోయాయి. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. శరీర ఉష్ణోగ్రతలు కూడా పడిపోతాయోనన్న భయంతో స్కూళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూసివేశారు. చలి తీవ్రతకు నయాగరా జలపాతం గడ్డ కట్టుకుపోయింది. నది ప్రవాహం కూడా నిలిచిపోయింది. షికాగో నగరం మొత్తాన్ని మంచు దుప్పటి కప్పేసింది.

INTERNATIONAL

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article