నేటితో ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెర

137
Compaigning For Delhi Polls Ends 6pm Today
Compaigning For Delhi Polls Ends 6pm Today

Compaigning For Delhi Polls Ends 6pm Today

హోరాహోరీగా , నువ్వా నేనా అన్నట్టు తలపడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఒకరి మీద ఒకరు మాటల దాడి చేసుకుని, మైకుల్లో ప్రచారాన్ని హోరెత్తించిన రాజకీయ పార్టీలు మైకులు సాయంత్రం ఐదు గంటలకు  మూగబోనున్నాయి. దీంతో ఆఖరి రోజు ప్రచారంలో ప్రధాన పార్టీలకు, చెందిన స్టార్ క్యాంపెయినర్లు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎన్నికలు ఆప్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్నాయి. సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా షాహిన్ బాగ్‌తో పాటూ, జామియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలతో రాజధానిలో రాజకీయం హాట్ హాట్‌గా మారిపోయింది. దీనికి తోడు ఆమ్ ఆద్మీ, బీజేపీల మధ్య నెలకొన్న మాటల యుద్ధంతో రాజకీయాలు తారాస్థాయికి వెళ్లాయి.

అటు ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపిస్తోంది ఎన్నికల సంఘం. ఈ నెల 8న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం ఐదు గంటలకు మైకులు మూగబోనున్నాయి. ఆఖరి రోజు ప్రచారంలో ప్రధాన పార్టీలకు ,చెందిన స్టార్ క్యాంపెయినర్లు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆప్, బీజేపీల మధ్య ముదిరిన మాటల యుద్ధం, సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నెల 8న పోలింగ్ జరుగనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ కూడా కొన్ని స్థానాల్లో గట్టి పోటీ అందిస్తోంది.

Compaigning For Delhi Polls Ends 6pm Today,delhi, election campaign

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here