కంగ్రాట్యులేషన్స్ జెర్సీ మూవీ టీమ్..

19
congrats to jersy team
congrats to jersy team

congrats to jersy team

తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో అవార్డ్స్ తక్కువగా వస్తాయనేది అందరికీ తెలిసిన విషయం. అవార్డ్సే రావడం లేదంటే ఇక అంతర్జాతీయ వేదికలపై మన సినిమాలకు గుర్తింపు వస్తుందనుకోలేం కదా. కానీ ఈ మధ్య ఈ రెండు అంశాల్లోనూ మన సినిమా ఎదుగుతోంది. నేషనల్ అవార్డ్స్ నుంచి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకూ మన సినిమాలు అర్హత సాధిస్తున్నాయి. ఇంతకు ముందు మహానటి, కేరాఫ్ కంచరపాలెం చిత్రాలు ఇంటర్నేషనల్ వేదికలపై సత్తా చాటితే లేటెస్ట్ గా నాని హీరోగా నటించిన జెర్సీ ఆ అరుదైన అవకాశాన్ని అందుకుంది. సినిమా.. మనసులను తాకాలి. మనల్ని మనం చూసుకుంటున్నట్టుగానో లేక మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నట్టుగానో అనిపించాలి. వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండాలి. సహజమైన ఎమోషన్స్ కనిపించాలి. సింపుల్ గా చెబితే వెండితెరపై ఓ ఫిక్షన్ చూస్తున్నట్టుగా కాక.. ఒక ఫ్యామిలీని చూస్తున్నట్టుగా కనిపించాలి. అప్పుడే అది గొప్ప సినిమా అవుతుంది. అయితే ఇలాంటి లక్షణాలున్న కథలు తెలుగులో అరుదు అని చెప్పుకోవాల్సి రావడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. కాకపోతే గత ఐదారేళ్లుగా ఇలాంటి వాస్తవికమైన కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. వాటికి ప్రేక్షకుల ఆదరణ కూడా ఉండటంతో ఇంకా పెరుగుతున్నాయి. ఏ దర్శకుడైనా ఎంచుకున్న కథను ఎంటర్టైనింగ్ గానే చెప్పాలనుకుంటాడు. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అనేది చాలామంది భావన. కానీ తను చెబుతోన్న విషయంలో ప్రేక్షకుడుని ఎంగేజ్ చేసే జానర్ ఏదైనా ఎంటర్టైన్మెంటే కదా. ఆ విషయంలో అద్భుతమైన ఎమోషనల్ కంటెంట్ తో కట్టిపడేసిన సినిమా జెర్సీ. మళ్లీరావా తర్వాత రెండో సినిమాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎయిటీస్, నైన్టీస్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ రంజీ ప్లేయర్ కథ. ఆటగాడిగా వైఫల్యం చెంది నిరుద్యోగంతో భార్య సంపాదనతో బ్రతుకుతూ.. కొన్ని అనుకోని సంఘటనల తర్వాత వయసు మీద పడ్డ టైమ్ లో మళ్లీ క్రికెట్ మొదలుపెట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ లో చోటు సంపాదించిన అర్జున్ అనే కుర్ర, యువకుడైన వ్యక్తి కథ జెర్సీ. కథాంశం బలమైనది.

ఆ కాలపు సాంఘిక పరిస్థితులను ప్రతిబింబిస్తూనే.. ప్రధాన పాత్ర ఆర్థిక స్థితిని, అసహాయతను చూపుతూ.. తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ.. భార్య భర్తల మధ్య దూరం పెంచుకుంటూ పోతే మనుషులే దూరమవుతారు అనేలా.. ఎక్కడా బిగి సడలని స్క్రీన్ ప్లేతో పాటు.. ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కించే ఎమోషనల్ కంటెంట్ తో జెర్సీ సినిమా చూస్తున్నంత సేపూ సినిమాగా కాక అర్జున్ అతని కొడుకు నాని, భార్య సారాల జీవితాన్నే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పాత్రలకు అంతగా కనెక్ట్ అయిపోయామంటే అర్థం సినిమాలో అందరికీ కనెక్ట్ అయినట్టు అర్థం. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన జెర్సీ.. ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ తెలుగు సినిమాల్లో ముందు వరుసలో ఉంటుంది. అనిరుధ్ అందించిన సంగీతం, సనూ వర్ఘిస్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్.. అన్నీ సినిమాకు సహజత్వాన్ని ఆపాదించాయి. అందుకే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ టొరంటో -2020లో అఫీషియల్ గా ప్రదర్శనకు అర్హత సాధించింది జెర్సీ. కథలో అందరికీ కనెక్ట్ ఆత్మ నిండిన జెర్సీ లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కూడా అదే స్థాయిలో ఉంటే మనం కూడా ఏ తమిళ్ మూవీసో లేక మళయాలంలో సినిమాలో చూసి.. అరె.. మనదగ్గర  ఇలాంటి సినిమాలు రావు ఎందుకు అనే ప్రశ్నలు వేసుకోం. ఏదేమైనా.. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ టొరంటో -2020కి అఫీషియల్ గా ఎంపికైన జెర్సీ మూవీ ఎంటైర్ టీమ్ కు కంగ్రాట్యులేషన్స్ చెబుదాం..

tolywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here