కాంగ్రెస్ టీడీపీ పొత్తుల కథ ముగిసింది

Congress and TPD Breaks Friendship

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల చిరకాల శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ, తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బద్ద శత్రుత్వాన్ని మరిచి రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని, కేసీఆర్ ను గద్దె దించాలని విశ్వప్రయత్నం చేసాయి .అయినప్పటికీ ప్రయత్నం విఫలం చెందింది.
టీడీపీకి మొదటినుండి తెలంగాణాలో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి, ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న పాపానికి కాంగ్రెస్ కూడా అదే గతి పట్టింది. ఈ వాస్తవాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కాంగ్రెస్ ఇక నుండి టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు టీడీపీ కూడా రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండబోదని తేల్చేసింది. రాహుల్ గాంధీతో భేటీ అయిన చంద్రబాబు ఈ నిర్ణయాన్ని తెలిపారట.
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకపోయినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం టీడీపీ మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉండబోతోందని చంద్రబాబు రాహుల్ గాంధీకి తెలిపారట. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఐసీయూలో ఉన్న పేషెంట్ స్థితి నుండి దాటి ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ కు అంత్యక్రియలు కూడా చేసేశారు కూడా. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పురుడు పోసుకుంటుందని భావించింది ఆ పార్టీ క్యాడర్ కానీ, టీడీపీ తాజా నిర్ణయంతో వారి ఆశలు ఆవిరైపోయాయి. టీడీపీ నాయకుల్లో కూడా కాంగ్రెస్ తో పొత్తుపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది, ఈ క్రమంలో పార్టీ క్యాడర్ అభిప్రాయం ప్రకారం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

Check out MS DHONI Signed Bat CLICK HERE

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article