ఢిల్లీ ఎన్నికల్లో 67 చోట్ల కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

135
Congress Loses Deposit In 67 Out Of 70 In Delhi
Congress Loses Deposit In 67 Out Of 70 In Delhi

Congress Loses Deposit In 67 Out Of 70 In Delhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  చావు దెబ్బ తింది. అడ్రెస్ లేకుండా పోయింది .పార్టీ ఊహించని విధంగా ఘోర పరాజయం పొందింది.  130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ 2015లో మాదిరిగానే ఖాతా తెరవలేదు. అయితే ఈ సారి ఆ పార్టీకి చెందిన 67 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం  కాంగ్రెస్ పార్టీకి షాక్ అనే చెప్పాలి . ఆప్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన అల్కా లాంబాకు కూడా డిపాజిట్ దక్కలేదు. ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్ దక్కించుకొన్నారు. గతంలో ఢిల్లీలో కాంగ్రెస్ రాజ్యమేలింది. షీలా దీక్షిత్ హయాంలో వరుసగా మూడుసార్లు గెలుపొందింది. కానీ ఆప్ పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ కనుమరుగైంది . ఈ ఎన్నికల్లో కాస్త పుంజుకుంటుందేమో అనుకున్న కాంగ్రెస్ మళ్ళీ చతికిలబడింది .  67 మందికి డిపాజిట్ దక్కకపోవడం పార్టీ నేతలను షాక్ కు గురిచేసింది.  అయితే గాంధీనగర్, బడ్లీ, కస్తూర్బా నగర్ తప్ప మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకోలేదు. ఆప్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అల్కా లాంబా కూడా చాందినిచౌక్‌లో డిపాజిట్ దక్కకపోవడం విశేషం.కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే కాదు డిపాజిట్ రాకున్నా కాంగ్రెస్ నేతలు  తమ ప్రత్యర్థి బీజేపీ కూడా ఓడిపోవడంతో కాస్త ఉపశమనం ఫీల్ అయ్యారు . దేశాన్ని విభజించి పాలించే బీజేపీ విధానాన్ని ప్రజలు తిరస్కరించారని చిదంబరం పేర్కొన్నారు.

Congress Loses Deposit In 67 Out Of 70 In Delhi ,Delhi elections,#delhielctionresults

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here