కాంగ్రెస్ పార్టీ కార్టూన్ రచ్చ

Congress Party CARTOON… ఈసీ టార్గెట్ , ఓవైసీ కౌంటర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈసీ ని టార్గెట్ చేసింది. అందులో భాగంగా నిండు కొలువులో ద్రౌపతి ని అవమానించిన ఘట్టాన్ని కార్టూన్ వేసి ప్రచారం ప్రారంభించింది. ఇక ఈ కార్టూన్ లో కెసిఆర్ ఓవైసీ లు ఉండడం రాజకీయ దుమారం రేపుతోంది.
తెలంగాణ ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివాదాస్పదమైన కార్టూన్‌తో రచ్చ చేశారు. తెలంగాణలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కన్నీరు పెట్టుకునేలా పాలన జరిగిందంటూ తెలంగాణ నాయకులను ఎద్దేవా చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ద్రుతరాష్ట్రుడితో, ఈఆర్‌వో, డీఈవో, సీఈవోలను దుశ్శాసనుడితో, ఓటర్లను ద్రౌపదితో పోల్చుతూ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆ కార్టూన్‌లో కీలకమైన వ్యక్తులుగా కేసీఆర్‌తో పాటు ఒవైసీ కూడా ఉండడం గమనార్హం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒవైసీ కాంగ్రెస్ నాయకులు హద్దుల్లో ఉండాలని హెచ్చరించారు.
ఈ కార్టూన్‌పై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. ‘ఇదే స్థానంలో మీ 50 సంవత్సరాల రాహుల్ గాంధీని, కొత్తగా జనరల్ సెక్రటరీగా నియమితురాలైన ప్రియాంక గాంధీని ఉంచితే ఎలా ఉంటుందో ఆలోచించుకొమ్మని ప్రశ్నించారు. ఘోర పరాజయం తర్వాత ఏం చేయాలో తెలియక ఇటువంటి నీచమైన కార్టూన్లతో ప్రచారం చేసుకుంటున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ ఎన్నికలలో ఈసీ తీరును ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ కి జరిగిన అన్యాయాన్ని, ప్రజాస్వామ్య అపహాస్యం పాలయిందనే విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article