త్వరలో కారెక్కే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Hot Topic, Few congress politicians ill jump into Car

తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేతలు అవకాశవాద రాజకీయానికి తెరలేపారు. డబుల్ గేమ్స్ ఆడుతున్నారు. ఒక పక్క పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరతాము అని సంకేతాలిస్తూనే అలా ఏం లేదు కాంగ్రెస్ లోనే ఉంటామని చెప్తున్నారు. ఇక అవకాశ వాద రాజకీయం సైతం ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. తెలంగాణలో ప్రజాకూటమి పొత్తులలో భాగంగా ఎన్నికలకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ తాము పోటీ చేసిన 90 స్థానాలలో కేవలం 19 స్థానాలను మాత్రమే దక్కించుకుంది . ఇక గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ తమ పార్టీ లోకి లాగే ప్రయత్నం చేస్తుంది. దాంతో కాంగ్రెస్ అధిష్టానానికి టెన్షన్ పట్టకుంది. ఇక ఆ నేతలు కూడా అధిష్టానంతో అవకాశం దొరికింది కదా అని గేమ్ ఆడుతున్నారు.

ఇక కొందరి పేర్లు కారెక్కే జాబితాలో ఎన్నికల ఫలితాలు వచ్చిన వారలోనే బయటకు వచ్చాయి. అయితే లాంటిది ఏమి లేదని చెప్పిన సదరు నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. ఇక తెలంగాణా అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ గా అవకాశం ఇవ్వమని అందుకు కావాల్సిన అర్హతలు తమకు ఉన్నాయని చెప్తున్నారు. లేదంటే జంప్ అవుతామనే సంకేతాలిస్తున్నారు. ఇక ఉన్న పార్టీ లో మంచి పదవి ఇస్తే ఉంటామని చెప్పకనే చెప్తున్నారు. ఇక అసెంబ్లీ లో సీఎల్పీ లీడర్ గా అవకాశం ఇవ్వండని అడుగుతున్న ఇద్దరు నేతలు పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందించకుంటే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ లోనే ఉంటామని చెప్తూనే మరోపక్క కేసీఆర్ పర్యటనకు వెళ్లి ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి. తాజాగా కేసీఆర్ కాళేశ్వరం పర్యటన సందర్భంగా కేసీఆర్ కు స్వాగతం పలికారు వీరు ఇరువురూ . ఇక కేసీఆర్ చేసే ఆపరేషన్ ఆకర్ష మాత్రమే కాదు కాంగ్రెస్ నేతల తీరు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు సీఎల్పీ లీడర్ గా ఎవరికి అవకాశం ఇవ్వాలన్నా కష్టంగానే కనిపిస్తుంది. ఒకరికి ఇస్తే ఈ సాకుతో వేరొకరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనే ఉద్దేశం తోనే వ్యూహాత్మకంగానే సీఎల్పీ లీడర్ విషయంలో తాత్సారం చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం . ఇక నాకంటే నాకు సీఎల్పీ లీడర్ అని అడుగుతున్న నేతలకు మరోపక్క టీఆర్ ఎస్ గాలం వేస్తుంది. పార్టీ లోకి ఆహ్వానిస్తుంది. భారీ ప్యాకేజ్ లే ముట్టజెప్పే ఆలోచనలో ఉంది. వెళ్ళాలని డిసైడ్ అయ్యి కూడా చూద్దాం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏదైనా బంపర్ ఆఫర్ ఇస్తుందేమో అని వెయిట్ చేస్తున్న నేతలు కూడా లేకపోలేదు.

తెలంగాణ ముందస్తు ఎన్నికల స‌మ‌రంలో కాంగ్రెస్ నుంచి 19 మంది గెలుపొందారు. ఇక వారిలో శ్రీధర్ బాబు, గండ్ర లు ఇద్ద‌రు కారెక్క‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తెరాస ఆక‌ర్ష్‌కు లొంగిన ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌లు త్వ‌ర‌లోనే తెరాస‌లో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్నార‌నే ప్రచారం సాగుతుంది. ఇక వారం రోజుల్లోనే టీఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. అయితే ప్ర‌స్తుతం కారెక్క‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న ఇద్ద‌రు నేత‌ల పేర్లు బ‌య‌టికి రావటం కాంగ్రెస్‌ను మ‌రింత క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. మంథ‌నిలో పుట్టా మధు ను ఓడించిన ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా నుంచి స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారిని ఓడించిన గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ఈ వారంలోనే పార్టీ మార‌బోతున్నార‌న్న టాక్ అటు కాంగ్రెస్ వర్గాలూను ఇటు టీఆర్ఎస్ వర్గాలలోను హాట్ టాపిక్ అయ్యింది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా ఆయన్ను కలిసినప్పుడే వాళ్ళు కారెక్కే ఆలోచనలో ఉన్నారని అర్ధమైపోయింది

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article