మల్కాజగిరి:అగ్నిపథ్ కు వ్యతిరేకంగా టిపిసిసి పిలుపు మేరకు మల్కాజిగిరి చౌరస్తాలో ఏర్పాటుచేసిన సత్యాగ్రహ సభకు టిపిసిసి అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశ సరిహద్దుల్లో మన యువ సైనికులు వుండడంతో మనం క్షేమంగా బతుకుతున్నాం. అగ్నిపథ్ పేరుతో 6 నెలల శిక్షణ ఇస్తే శత్రుదేశాల నుంచి కాపాడడానికి ఎలా సరి పోతోంది అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు ఇజ్రయల్ తరహా అని చెవుతున్నారు. అక్కడ అదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తారు అది గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రములో గ్యాస్,నిత్యావసర,పెట్రోల్ ధరలు తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో60వేలమంది నిరుద్యోగులు వున్నారు 6సంవత్సరాలు శిక్షణ చేసినవారు తరువాత యువత నిరుద్యోగoతో నెరప్రవృత్తి దారి తీయడానికి ఆస్కారం ఉందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కలిసి తెలంగాణా యువకుల పై పెట్టిన కేసులో తొలగించాలని కేంద్రమంత్రులకు మెమోరాండం సమర్పించాలని రేవంత రెడ్డి కె.టి.ఆర్.ని డిమాండ్ చేశారు.
అగ్నిపథ్ వ్యతిరేకంగా సీకింద్రబాద్ రైల్వే ధ్వంసం కేసులో జైల్ కు వెళ్లిన యువతకు కాంగ్రెస్ అండ ఉంది లాయర్ల ను పెట్టి వారికి బయటకు తెస్తాం అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్టంలో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం శవరాజకీయలు,టి.ఆర్.ఎస్ జెండాలు పెట్టి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఉద్యోగాల పేరుతో అగ్నిపథ్ ను ప్రారంభించడo నిరుద్యోగులకు శాపంగా మారింది దాన్ని ఆసరాగా తీసుకుని,రాష్టంలో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను కాల్చిచంపిన ఘనత తెలంగాణా ముఖ్యమంత్రి కే దక్కుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ సత్యగ్రహ దీక్ష పాల్గోన్న రేవంత్ రెడ్డి
