Congress to parliament, Senior OLD Minister Participating
ప్రజా కూటమి తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులందరూ, పార్లమెంట్ ఫైట్‌కు సిద్దమంటున్నారు. టికెట్ కోసం అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్‌పై రివెంజ్ తీర్చుకోవడానికి రగిలిపోతోంది. ముఖ్యంగా ఓటమి ఎరుగని ఉద్దండ నేతలు, దారుణంగా ఓడిపోయారు. వీరంతా పార్లమెంట్ బరిలోకి దిగి, సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. మాజీ మంత్రులైన నేతలందరినీ పార్లమెంటు బరిలో దించి అధికార టిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కవ పార్లమెంటు సీట్లు సాధించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్. దీంతో పార్టీ ప్రముఖులంతా పార్లమెంటు బరిలో ఉంటారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే, మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తాను పార్లమెంటు ఎన్నికల రంగంలో ఉంటానని ప్రకటించారు. తన సొంత పార్లమెంటు స్థానమైన నల్గొండ నుంచి పోటి చేస్తారని చెప్పారు. ఇప్పటికే తాను పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఆయన ఇటీవల పార్లమెంటు రివ్యూ మీటింగ్ సందర్భంగా వెల్లడించారు. ఇక ఈయనతోపాటు, జానారెడ్డి సైతం అదే నల్గొండ పార్లమంటు పరిధిలోకి వస్తారు, కాబట్టి ఆయన కూడా అక్కడి నుంచి పోటి చేయాలని భావిస్తున్నారు. అయితే, జానారెడ్డి నల్గొండ పార్లమెంటు నుంచి రంగంలో ఉంటే, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి రంగంలో దిగే అవకాశముంటుంది. ఇక మహహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి మాజీమంత్రి డికే అరుణ పోటీ చేయడానికి ఆసక్తి చూపులున్నట్లు పార్టీలో చర్చ జరగుతోంది. అధిష్టానం తనను పోటిచేయమంటే సిద్దమన్నట్టు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎంపి కొండావిశ్వేశర్ రెడ్డి బరిలో ఉంటారు. ఇక సికింద్రాబాద్ నుంచి మాజీ ఎంపి అజారుద్దీన్ టిక్కెట్ ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు నుంచి మాజీ కేంద్రమంత్రులు సర్వే సత్యనారాయణతోపాటు… జైపాల్ రెడ్డి సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ పార్లమెంటు నుంచి మాజీ ఎంపి విజయశాంతి పోటి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నుంచి గీతారెడ్డి పోటి చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి మధుయాష్కి గౌడ్, లేక సుదర్శన్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి రాములు నాయక్, లేక బెల్లయ్య నాయక్, వరంగల్ నుంచి బలమైన నేతను రంగంలో దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్‌ను రంగంలో దించడం ద్వారా, పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకోవచ్చని భావిస్తోంది కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా అప్పుడే పార్లమెంట్‌పై గురిపెట్టారు. మరి ఎవరికి అధిష్టానం అవకాశం ఇస్తుందో వేచి చూడాలి.