Thursday, December 5, 2024

ఆస్తి కోసం…! కానిస్టేబుల్ నాగ‌మ‌ణి హ‌త్య‌

హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి సోమవారం ఉదయం హత్యకు గురయ్యారు.
కానిస్టేబుల్‌ నాగమణి హత్యలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత పరువు హత్య అనుకున్నప్పటికీ కారణాలు వేరే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇది పరువు హత్య అని తొలుత భావించినప్పటికీ పోలీసుల విచారణలో ఆస్తి గొడవలే కారణమని తెలస్తున్నది.
రాయపోల్‌కు చెందిన నాగమణి గత నెల 1న.. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ను యాదగిరిగుట్టలో కులాంతర వివాహం చేసుకున్నది. అనంతరం వారు హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్లారు. అయితే సోమవారం ఉదయం స్కూటీపై డ్యూటీకి వస్తుండగా.. కారులో వెంబడించిన తమ్ముడు పరమేష్‌ ఆమెను ఢీకొట్టాడు. అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తి కోసమే చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో పరమేశ్‌ అన్నీ తానే చూసుకున్నాడు. కాగా ఆమెకు ఇదివరకే వివాహమై విడాకులు కూడా అయ్యాయి. దీంతో తమ వారసత్వంగా వచ్చిన భూమిని మొదటి వివాహం తర్వాత తమ్ముడికి ఇచ్చేసింది. అయితే రెండో పెండ్లి చేసుకున్న తర్వాత.. ఆ భూమిలో వాటా ఇవ్వాలని గత కొంతకాలంగా తమ్ముడిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో అక్కపై కోపంతో ఉన్న పరమేశ్‌ ఆమెను హత్యచేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular