కానిస్టేబుల్ సస్పెండ్@వనపర్తి

CONSTABLE SUSPEND @ WANAPARTHY

మంత్రి కేటిఆర్ గారి సూచన మేరకు ఇవ్వాళ వనపర్తి సంఘటన వీడియోలో ఉన్న ఆ బాలుడిని కలిసిన వనపర్తి ఎస్పీ అపూర్వ రావు. ఈ విషయంలో దుందుడుకుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

కరోనా నేపథ్యంలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నార‌ని, ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖ‌ర్ రావు ప్ర‌త్యేకంగా ఇన్సెంటీవ్ ను అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో, ప్ర‌తిఒక్కరు శ‌భాష్ అని అంటున్నారు. అయితే కొంద‌రు పోలీసులు చేస్తున్న నిర్వాకం వ‌ల్ల మొత్తం డిపార్టుమెంట్ కు అప్ర‌తిష్ఠ వ‌స్తున్న‌ది. ఇలాంటి సంఘ‌ట‌న వ‌న‌ప‌ర్తి జిల్లాలో జ‌రిగింది. అక్క‌డ ఒక యువ‌కుడిని అత‌ని కొడుకు ముందే పోలీసులు కొట్టే వీడియో వైర‌ల్ అయ్యింది. పైగా, ఆ పిల్ల‌వాడు చేస్తున్న ఆక్రంద‌న‌లు వింటుంటే ఎవరి హృద‌య‌మైనా క‌రుగుతుంది. ఆ పిల్లవాడిని కూడా పోలీసులు ఇన్నోవా వాహనాన్ని ఎక్కించేశారు. పోలీసులందరూ మూకుమ్మడిగా ఆ ఇద్దరి పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని ప్రజలెవరూ జీర్ణించుకోలేరు. వాస్తవానికి, కరోనా నేపథ్యంలో ప్రజలు బయటికి రావొద్దని ప్రభుత్వమే చెబుతున్నది. అయినా, కొందరు వ్యక్తులు ఇలా రోడ్ల మీదికొచ్చేస్తున్నారు. వీరి పట్ల పోలీసులు ఇలా అమానుషంగా ప్రవర్తించకుండా.. అక్కడే ఆ పిల్లవాడికీ అర్థమయ్యేలా రోడ్డు మీద నిలబెట్టి ఉంటే బాగుండేది. అంతేతప్ప, ఇలా పోలీసులు కర్క‌షంగా ప్రవర్తించడాన్ని ఎవరూ హర్షించరు. అయితే, ఈ వీడియో మొత్తానికి మంత్రి కేటీఆర్ వ‌ద్ద‌కు చేరింది. ఆయ‌న వెంట‌నే స్పందించారు.
పోలీసులు ఇలా ప్ర‌వ‌ర్తిస్తే ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించ‌న‌ని హెచ్చ‌రించారు. కొడుకు ముందే తండ్రిని కొడ‌తారా అని? ఈ విష‌యంలో హోం మంత్రి మ‌హ‌మూద్ ఆలీని త‌గిన చ‌ర్య‌లు తీసుకోమ‌ని కోరారు.

minister ktr latest tweet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *