తొలివిడత పంచాయితీ పోరులో టీఆర్ఎస్ దే హవా

TRS continues its Victory Saga in Panchayats too .. ఫలితాలు ఇవే

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నే కాదు తాజాగా జరిగిన తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడు చూపించింది. తనకు ఎదురు లేదంటూ మరోమారు సత్తా చాటుకుంది.ఆ పార్టీ మద్ధతు ప్రకటించిన అధ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందారు. తొలి దశలో 4,479 గ్రామ పంచాయతీల ఎన్నికకు నోటీసులు ఇవ్వగా… 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఏకగ్రీవమైన పంచాయతీలలో కూడా టిఆర్ఎస్ హవానే కొనసాగింది.
మిగిలిన 3701 పంచాయతీల్లో ఎన్నికల సంఘం పోలింగ్ జరిపింది. సోమవారం జరిగిన మధ్యాహ్నం వరకు జరిగిన ఎన్నికల్లో 85.76 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. రాత్రి వరకు జరిగిన కౌంటింగ్ లో వెలువడిన తుది ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
టిఆర్ఎస్ పార్టీ తొలి విడత పంచాయతీ ఎన్నికలలో 2629 పంచాయతీలను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 920 పంచాయతీలను, టిడిపి 31 పంచాయతీలను, బిజెపి 67 పంచాయతీలను, సిపిఐ 19 పంచాయతీలను, సిపిఎం 32 పంచాయతీలను, ఇక ఇతరుల 758 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. ఇంకా ఫలితం తేలని పంచాయితీలు 14 ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. మొత్తానికి తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సైతం కారు రయ్యిన దూసుకుపోయింది. టిఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందిన పరిస్థితి ఉంది. ఇక ఇదే హవా మరో రెండు దఫాలు జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతుందని టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article