సీపీఎస్ రద్దు కోసం పోరుబాట పట్టనున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య

CONTRIBUTORY PENSION SCHEME

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ సిపిఎస్ రద్దు పై రాష్ట్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని తెలియజేయకపోతే సెప్టెంబరు 1న రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ డేగా ప్రకటించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నిర్ణయించింది. సిపిఎస్ విధానంపై జగన్ సర్కార్ ఇప్పటివరకు ఎటూ తేల్చ లేదు అని దీనిపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చర్చించింది.

విజయవాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎస్ కు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది .సిపిఎస్ రద్దు చేస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఇప్పుడు సిపిఎస్ రద్దు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు అని చర్చించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేతలు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయనకు ఈ విషయం పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నాయకులు. ఇక సిపిఎస్ రద్దు విషయంలో ఎలాంటి హామీ లభించకపోతే మాత్రం 1న బ్లాక్‌ డే నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నాలు, మానవహారాలు, ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు. సీఎం అమెరికా పర్యటనకు ముందే ఏపీ ఉద్యోగుల సమాఖ్య నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక ఆయన అమెరికానుంచి రాగానే మరోసారి అపాయింట్‌మెంట్‌ కోరదామని నిర్ణయించారు. లేని పక్షంలో సెప్టెంబరు 1న బ్లాక్‌ డేను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు.

KCR YADADRI  TOUR

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *