కొరియర్ ద్వారా 20 కిలోల బంగారం

54
Cops seize 20 kg gold
Cops seize 20 kg gold
Cops seize 20 kg gold in vijayawada
విజయవాడలో  భారీగా బంగారం పట్టుబడింది. కొరియర్ ద్వారా  పంపిన 20 కిలోల బంగారు ఆభరణాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.బంగారం స్మగ్లింగ్‌ విజయవాడకు కొత్త కాదు. ఒకప్పుడు బస్సులు, రైళ్ల ద్వారా బిల్లులు లేని బంగారం తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఏకంగా విమానాలతో రవాణా చేస్తున్నారు. కొరియర్‌ సంస్థలే ముంబయిలో సరకు లోడ్‌ చేసి ఆ తరువాత ఇక్కడ తీసుకుని వ్యాపారులకు అప్పగిస్తుంటాయి. బిల్లులు లేకుండా గమ్యానికి చేరితే లక్షల్లో లాభం ఉండటంతో కొందరు వ్యాపారులు ఈ జీరో బిజినెస్‌ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.   ముంబై నుంచి కార్గో కొరియర్ ద్వారా గన్నవరం విమానాశ్రయం తీసుకువచ్చిన 20 కిలోల బంగారు ఆభరణాలను  స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు జీఎస్టీ, ఇతర పన్నులు ఎగవేసి నగరంలోని బంగారు దుకాణాలకు ఈ ఆభరణాలను సరఫరా చేస్తున్నట్టు  కనుగొన్నారు . దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. జీఎస్టీ అధికారుల సమక్షంలో కేసును టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం విచారించనుంది. పట్టుబడ్డ బంగారం విలువ 17 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Cops seize 20 kg gold in vijayawada,vijayawada, gold ornaments , courier , task force police , mumbai , gannavaram airport , gst , taxes

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here