తెలుగు రాష్ట్రాలకు కరోనా, స్వైన్ ఫ్లూ భయం

136
Corona And Swine Flu Fear
Corona And Swine Flu Fear

Corona And Swine Flu Fear In Telugu States

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది . ఇప్పటికే 70కిపైగా దేశాల్లో ఈ వైరస్ అతలాకుతలం చేసింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి టీకా కనుగొనలేదు.  టీకా కనుగొన్నామని అమెరికా చెప్తున్నా, ఎప్పుడు దాన్ని మనుషులపై ప్రయోగిస్తారు. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్నది సస్పెన్స్ గా ఉన్నది.  ఈ కరోనా ఇప్పుడు ఇండియాలోకి ఎంటర్ అయ్యింది. హైదరాబాద్ లో మొదటి కేసు నమోదైంది.  మరో ముగ్గురు కరోనా లక్షాణాలతో గాంధీలో ఉన్నారు.  వీరికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ రావాల్సి ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు హైదరాబాద్ ను మరో విషయం  కూడా భయపెడుతుంది.  అదే స్వైన్ ఫ్లూ. పేట్లబురుజు ప్రాంతానికి చెందిన 9 మంది పోలీస్ కానిస్టేబుల్లు స్వైన్ ఫ్లూ అనుమానంతో ఎర్రగడ్డ ఛాతి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.  కాగా, ఇందులో ఒకరికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా రిపోర్ట్ రావడంతో చికిత్స అందిస్తున్నారు.  చికిత్స తీసుకుంటున్న వ్యక్తి ఆరోగ్యం బాగానే ఉందని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు వైద్యులు.

ఇక ఏపీలో కరోనా ప్రభావం లేదని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని… కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందేమోననే ఆందోళన ప్రజలకు వద్దన్న ఆయన.. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక, కరోనా వ్యాప్తి నిరోధానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు మంత్రి.. రాష్ట్రంలో 200 మందికి పైగా ప్రయాణికులకు అన్ని రకాల పరీక్షలు చేశామని.. కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా లేదని స్పష్టం చేసిన మంత్రి.. 11 మందికి చెందిన రక్త నమూనాలు కూడా పుణే పంపామని  అయినా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. మరోవైపు ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులతో పాటు ఐసోలేషన్ రూములు కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు మంత్రి ఆళ్ల నాని.. కరోనా వైరస్ నివారణకు కావాల్సిన మందులు.. మాస్కులు.. వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటూనే.. పాజిటివ్ కేసులు నమోదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ఇక, కరోనా చికిత్స కోసం ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న ట్రైనింగ్‌కు రాష్ట్రం నుంచి వైద్యులు వెళ్తున్నారు.. 9వ తేదీన ఏపీలో కరోనా చికిత్సపై ట్రైనింగ్ ఇస్తామని వెల్లడించారు మంత్రి. ప్రజల్లో అవగాహన కోసం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఏఎన్ఎంల ద్వారా కరపత్రాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు మంత్రి ఆళ్ల నాని.
Corona And Swine Flu Fear In Telugu States,telugu states , corona virus , swine flu , andhra pradesh , telangana , gandhi hospital 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here