మార్చి నుంచి మరో సినిమా అవుట్

68
CORONA EFFECT ON MOVIES
CORONA EFFECT ON MOVIES
CORONA EFFECT ON MOVIES
కరోనా.. నిన్నటి వరకూ ఇతర దేశాల్లోనే ఎక్కువగా యాక్టివ్ గా ఉణ్న ఈ వైరస్ ఇప్పుడు ఇండియాను సైతం వణికిస్తోంది. లేటెస్ట్ గా తొలి కరోనా మరణం కూడా నమోదైంది. ఈనేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల వరకూ ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో అన్ని చోట్లా వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావం పడింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎక్కువ మొత్తంలో జనం గుమి కూడి ఉండేది.. బాగా దగ్గరగా ఉండేది థియేటర్స్ లోనే కాబట్టి ఇప్పటికే కేరళ రాష్ట్రంలో థియేటర్స్ మూసివేశారు. థియేటర్స్ మూయడం వరకూ ఎందుకు అనుకున్నారేమో.. ఇతర చోట్ల రిలీజ్ డేట్స్ వాయిదా వేస్తున్నారు.
ట్రైలర్ తో సంచలనం సృష్టించిన అక్షయ్ కుమార్ సూర్యవంశీ ఈ నెల 24న విడుదల కావాల్సి ఉంది. మొదట్లో ఈ చిత్రం నాని ‘వి’చిత్రానికి పోటీ ఇస్తుందనుకున్నారు. 25న రావాల్సిన నాని సినిమా కూడా పోస్ట్ పోన్అయింది. అయితే ఎక్కువ మొత్తంలో మార్కెటింగ్ ఉన్న సూర్యవంశీని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. దీంతో అక్కీ ఫ్యాన్స్ లో నిరాశ కలిగింది లాంటి మాటలేం లేవు. ముందు హ్యాపీగా సినిమా చూడాలంటే.. ఈ గొడవలేం ఉండకూడదు కదా.. అందుకే కరోనా వల్ల సినిమాకు వెళ్లొద్దు అనుకున్నవాళ్లు కూడా ఇప్పుడు తర్వాత నింపాదిగా చూడొచ్చు అని హ్యాపీగా ఫీలవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here