కరోనాను పెంచిన మతప్రార్ధనలు

36
CORONA RISE DUE TO MARKAZ
CORONA RISE DUE TO MARKAZ

CORONA RISE DUE TO MARKAZ

కరోనా వైరస్ ప్రబలటానికి కారణంగా మారాయి దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కాజ్ మసీదులో నిర్వహించిన సామూహిక ప్రార్థనలు. ఈ ప్రార్థనల్లో విదేశీయులు పాల్గొనడంతో వారి ద్వారా కరోనా చాలా మందికి సోకింది. మార్చి 10న జరిగిన తబ్లీఘీ-జమాత్ మతప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మత ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారిపై దృష్టి సారించారు. తబ్లీఘీ-జమాత్ మతప్రచార కార్యక్రమంలో మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్‌తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు హాజరయ్యారు. ఇక వీరి నుండి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టు తెలుస్తుంది.

తాజాగా ఈ సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో 24 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇంకా కేసులు పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వీరంతా ఢిల్లీ వాసులేనని కేంద్రం వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఢిల్లీ పోలీసులు మసీదును సీజ్ చేశారు. ఈ మసీదులో మొత్తం 1700మంది వరకు ప్రార్థనలు చేశారని సత్యేంద్ర జైన్ తెలిపారు. ఇప్పటిదాకా 800 మందిని గుర్తించి క్వారంటైన్ కు తరలించామని అధికారులు తెలిపారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ మర్కాజ్ మసీదులో జరిగిన ప్రార్ధనలే ఇప్పుడు కరోనా మహమ్మారిని మరింత ప్రబలేలా చేశాయి. ఇక నిబంధనలు పాటించకుండా ప్రార్థనలు నిర్వహించడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా పరిగణించారు. స్థానిక యంత్రాంగం పట్టించుకోక పోవడంపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారానే కరోనా సోకిందని తెలిపారు.

tags: Delhi, Nizamuddin Markaz Religious Prayers, tablighi jamat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here