CORONA Shocking Facts
కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని అతలాకుతులం చేస్తోన్న కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇది సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని, అది రూపు మార్చుకుంటుందని వైట్ హౌస్‌కు చెందిన శాస్త్రవేత్త డా. ఆంటోని ఫౌసీ వెల్లడించారు. సైకిల్ ప్రక్రియలాగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొని.. రోగులపై ప్రయోగించాలని తాము అనుకుంటున్నామని.. తద్వారా మళ్లీ కరోనా వచ్చినప్పుడు భారీ ముప్పును నిరోధించగలమని ఫైసీ అన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలకు కరోనా విస్తరించగా.. అన్ని దేశాల్లో ఒక్కో ఫేజ్‌లో ఉందని.. దీంతో ఈ వైరస్ గురించి లోతుగా తెలుసుకునేందుకు కావాల్సిన సమాచారం తమ దగ్గర ఉందని ఫౌసీ పేర్కొన్నారు. చైనా కొత్త కేసులు నమోదు కానంత మాత్రానా.. వైరస్‌పై ఆ దేశం విజయం సాధించినట్లు కాదని ఫౌసీ తెలిపారు. కాగా కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగునేందుకు 12 నుంచి 18 నెలల సమయం పట్టొంచ్చంటూ ఫౌసీ ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు అగ్రదేశాలన్నీ నడుం బిగించాయి. ముఖ్యంగా చైనా, అమెరికా, జర్మనీ లాంటి దేశాలు ఈ వైరస్‌కు వీలైనంత త్వరగా విరుగుడును కనుకొనాలని అనుకుంటున్నాయి. మరోవైపు మలేరియా, హెచ్ఐవీ రోగాలకు ఉపయోగించే మందులను కరోనా బాధితులకు ఇవ్వగా.. వారు కోలుకున్నారని పలువురు డాక్టర్లు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఏది ఏమైనా త్వరిత గతిన దీనికి అడ్డు కట్ట వెయ్యకుంటే ప్రజలు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉంది.
tags: corona virus, corona pandemic, India America, whitehouse, scientist, antony fauci, vaccine, clinical trails