గాలి ద్వారా కరోనా వ్యాప్తి?

There's a chances of corona spreading in the air, So every one has to be extra careful for next four to six weeks. If any one goes out from the home, after returning must use mask compulsory in the home. As There's a bed shortage in Telangana, If cases increase like this, no doubt Telangana shall become another Maharashtra. So, Telangana Health Director Mr Srinivas warns people to be extra careful and follow Covid norms strictly.

250

Corona Spreading In Air?

తెలంగాణ రాష్ట్రంలో గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఆఫీసు పని లేదా ఇతర పనుల మీద బయటికెళ్లి వచ్చేవారు ఇంట్లో కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. లేకపోతే అతని ద్వారా ఇంట్లోని కుటుంబ సభ్యులకు కొన్ని గంటలు లేదా ఒకట్రెండు రోజుల్లోనే వైరస్ సోకే ప్రమాదముందని హెచ్చరించారు. ఒకవేళ ఆస్పత్రిపాలైతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కోరారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

‘‘ గత నాలుగు వారాల్నుంచి కరోనా తీవ్రంగా ఉంది. వచ్చే నాలుగు నుంచి ఆరు వారాల దాకా పరిస్థితి ఇలాగే తీవ్రంగా ఉంటుంది. ఇలాగే మనం గాలికి వదిలేస్తే తెలంగాణ కూడా మహారాష్ట్ర మాదిరిగా మారే ప్రమాదముంది. కరోనా పెరగడం వల్ల ఆస్పత్రుల్లో బెడ్ లు దొరకడం లేదు. కేసులు పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం లాక్ డౌన్ వైపు కానీ కర్ఫ్యూ వైపు కానీ వెళ్లడం లేదంటే పరిస్థితి తీవ్రంగా లేదని కాదు. కేసులు చాలా తీవ్రంగా ఉన్నాయని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రజల జీవనోపాధి దెబ్బతినకూడదు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన కూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం లాక్ డౌన్ వైపు మొగ్గు చూపడం లేదు. కాబట్టి, ప్రజలు స్వీయనియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఒక ఇంట్లో ఒకరికి కొవిడ్ వచ్చిందంటే, కొన్ని గంటలు లేదా ఒకట్రెండు రోజుల్లో కుటుంబంలోని మిగతా వారందరికీ వచ్చే ప్రమాదముంది. ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఈ వైరస్ చాలా వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందుతోంది. కాబట్టి, ప్రజలందరూ కొవిడ్ నిబంధనలకు తప్పకుండా పాటించాలి. మాస్కు తప్పనిసరిగా ధరించాలి.’’

for Video, Click Here:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here