15-18 ఏళ్ల పిల్లలకు టీకా షురూ

  • నాలుగు వారాల తర్వాత 2వ డోస్

15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు ఈరోజు నుండి కొవాగ్జిన్ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. నాలుగు వారాల తర్వాత 2వ డోస్ టీకా ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1014 ప్రభుత్వ కేంద్రాల్లో పిల్లలకు టీకాలు వేస్తున్నామని తెలిపారు. GHMC తో పాటు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్ లలో కోవిన్ ద్వారా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్దతిలో టీకాలు వేస్తున్నామని తెలిపారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..

నాలుగు రోజుల తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రేజిస్ట్రేషన్ పై సమీక్షిస్తాం. తల్లి తండ్రులు లేదా ఉపాధ్యాయుల సమక్షంలోనే టీకాలు అందిస్తాం. అన్ని కాలేజీల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు , తల్లి దండ్రులు.. పిల్లల వాక్సినేషన్ బాధ్యత తీసుకోవాలి. కాలేజీలో ప్రతి విద్యార్థి టీకా తీసుకునేలా అధ్యాపకులు బాధ్యత తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తది అనే అపోహ వద్దు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కాలేజి ఐడి కార్డ్ లో ఏది ఉన్నా సరిపోతుంది రాష్ట్రం తరపున కేంద్రాన్ని బుస్టర్ డోస్ గురించి చాలా కాలంగా కోరాం. లేఖలు రాశాం. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు , ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే పాజిటివిటీ రేట్ నాలుగు రెట్లు పెరిగింది.

  • 100% మొదటి డోస్ టీకా పూర్తి చేసిన రాష్ట్రాలను.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖా ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్సు లో అభినందించింది. తొలి డోసు వంద శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. తొలి రెండు వేవ్ లలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమర్ధంగా పని చేశారు. మూడో వేవ్ వస్తే ఇబ్బంది లేకుండా సన్నద్ధంగా ఉండాలి. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ అసపత్రులకు వెళ్లి ప్రజలు డబ్బు వృధా చేసుకోవద్దు. ఎలాంటి లక్షణాలు ఉన్నా దవాఖానకు వచ్చి టెస్ట్ లు చేయించుకోవాలి.
  • సూర్యాపేట మెడికల్ కాలేజి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేశాం. ఈరోజు మధ్యాహ్నానికి రిపోర్ట్ వస్తుంది. ఘటన రుజువైతే అందులో ఇన్వాల్వ్ అయిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి పునరాృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article