చైనాలో మరణ మృదంగం..

Coronavirus Death Toll In China Reaches 1 523 Confirmed

చైనాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. మరణ మృదంగం మోగిస్తోంది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో చైనాలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే చైనాలో 1523 మంది మరణించారు.మొత్తం చైనా వ్యాప్తంగా 66వేల మంది మరణించినట్టు నిర్ధారణ అయ్యింది.  ఇందులో 11053మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం.  వీరు మరణిస్తే చైనాలో పెద్ద విషాదం నిండడం ఖాయం..మరోవైపు చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏకంగా మరో 8096మందికి సోకింది. వ్యాధికి కేంద్ర బిందువైన హుబే వూహాన్ లో మాత్రమే దీని తీవ్రత బాగా ఉందని చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చైనాలోని వుహాన్ నుంచి తీసుకొచ్చిన 406మంది భారతీయులను మానేసర్ – ఢిల్లీలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కేంద్రాల్లో ఉంచారు. కరోనా సోకలేదని తేలాకే వీరిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.  కరోనా వైరస్ కరెన్సీ నోట్ల ద్వారా కూడా సంక్రమిస్తోందని తేలడంతో చైనా హుబే ప్రాంతం నుంచి కరెన్సీ నోట్ల చలామణీని తాత్కాలికంగా ఆపేసింది.  కొత్త నోట్లను పంపిస్తోంది.

Coronavirus Death Toll In China Reaches 1 523 Confirmed,corona virus, corona virus india, corona virus china , corona deaths

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article