స్టాక్ మార్కెట్ల పై కరోనా ఎఫెక్ట్…

189
Coronavirus stock market impact?
Coronavirus stock market impact?

Coronavirus stock market impact?

ప్రపంచ దేశాలనే కాదు కరోనా వైరస్ స్టాక్ మార్కెట్లనూ వణికిస్తుంది . నిన్న లాభాల బాట పట్టిన మార్కెట్లు ఈరోజు మళ్లీ పతనమయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. దీంతోపాటు, బలహీనంగా ట్రేడ్ అయిన ఆసియా మార్కెట్ల ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 40,913కు పడిపోయింది. నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయి 12,035 వద్ద స్థిరపడింది.
ఇక టాప్ గెయినర్స్ జాబితా చూస్తే బజాజ్ ఆటో (1.48%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.91%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.91%), ఎన్టీపీసీ (0.57%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.25%) ఉంటే
టాప్ లూజర్స్జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.54%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.09%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.07%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.03%), సన్ ఫార్మా (-1.92%) ఉన్నాయి.

Coronavirus stock market impact?,coronavirus, stock market, BSe sensex, nse nifty, india, wuhan, CoronavirusinIndia, Coronavirusinchina,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here