ఎమర్జెన్సీ మీటింగ్ ..థియేటర్లు మూసివేత ?

Coronavirus : Will Telangana Movie Theaters Close

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్  కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ మన టాలీవుడ్ మీద పడింది. ఇక  నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేయాలని సినీ పెద్దలు ఎమర్జెన్సీ  మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. నేటి సాయంత్రం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో సినీ పెద్దలు నేటి సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశం జరగనుంది.

ఈ మీటింగ్ కు హాజరు కావాలని పలువురు పెద్దలకు నిన్న సాయంత్రమే మెసేజ్ వెళ్లింది. కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్ లను వాయిదా వేసుకోవడం, కేసుల సంఖ్యను పెరిగే అంశాన్ని బట్టి, సినిమా హాల్స్ మూసివేత తదితర అంశాల మీద ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవచ్చని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు, కరోనాపై ప్రజల్లో ఆందోళనను తొలగిస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు. ముఖానికి మాస్క్ ధరించిన ప్రభాస్, ఎయిర్ పోర్టుకు వెళుతుంటే క్లిక్ మనిపించిన ఫోటోలు నిన్న వైరల్ అయ్యాయి. ఇక ఈ నేపధ్యంలో కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై పడితే చాలా మంది ఉపాధి కోల్పోతారు. పరిశ్రమలో తీవ్ర నష్టం వస్తుంది.

నిన్నా మొన్నటి దాకా మన దేశానికి కరోనా ప్రభావం లేదని భావిస్తే తాజాగా కరోనా బాధితుల సంఖ్యా ఆందోళనకరంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇటు తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా కేసులు నమోదు అవుతున్న సమయంలో  ఇంకా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యల్లో భాగంగానే తెలుగు సినీ పారిశ్రామిక వర్గాలు ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు  తెలుస్తుంది.

Coronavirus : Will Telangana Movie Theaters Close,coronavirus,  covid 19,  wuhan,   california, usa, america, india, telangana, hyderabad, telangana government , high alert ,tollywood, theatres colsure , financial effect , shootings cancel

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article