హైదరాబాద్:భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బర్కత్ పూరాలోని బిజెపి సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో అవినీతి రహిత పాలన జరుగుతుంటే తెలంగాణలో అభివృద్ధి పేరుట అవినీతి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా మారింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుంది. తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ పాలనపై భరోసా ఉంది. 2023లో జరిగే ఎన్నికల్లో బిజెపి బిజెపి మోగించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఎంఐఎం మనుషులను విభజించే పార్టీ తప్ప మనుషులను కలిపే పార్టీ కాదు. యూపీలో దాని ప్రభావం ఏమాత్రం లేదని కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు…