Country wide Businessman BUND… అమరుల కుటుంబాలకు సంఘీభావం
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు ఫిబ్రవరి 18 న బంద్ పాటిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా సోమవారం అన్ని వ్యాపారాలను మూసివేస్తామని..ఎటువంటి లావాదేవీలు జరుగబోవని అఖిల భారత వాణిజ్య సంఘాల కూటమి (కెయిట్) తెలిపింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లన్నీ బంద్ పాటిస్తున్నాయి. అమర జవానులకు నివాళులర్పిస్తు..టెర్రరిస్ట్ ఎటాక్ ను వ్యతిరేకిస్తు దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులంతా నిరాహార దీక్ష చేపట్టాలని కెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ కోరారు. అలాగే వ్యాపారులంతా విరాళాలు సేకరించి అమరుల కుటుంబాలకు నేరుగా అందజేస్తామన్నారు.
ఈ బంద్ సందర్భంగా నిత్యావసర వస్తువుల సరఫరా.. ప్రజారవాణాను బంద్ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. పాకిస్థాన్‌కు చైనా మద్దతు తెలుపుతున్నందున చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త ప్రచారోద్యమం చేపట్టనున్నట్లు ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. బంద్ సందర్భంగా ఢిల్లీలో పేరొందిన చాందినీ చౌక్, కశ్మీరీగేట్, చావ్రీ బజార్, సదర్ బజార్, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, రాజౌరి గార్డెన్, కమలానగర్, సౌత్ ఎక్స్‌టెన్షన్, లజపత్ నగర్, లక్ష్మినగర్, ప్రీత్ విహార్, శాహ్దరా, గాంధీ నగర్ మార్కెట్లన్నీ మూసివేస్తారని కెయిట్ తెలిపింది.
For More Click Here