తెలంగాణ కార్మికులకు వ్యాక్సీన్

Telangana Construction Companies are taking care of their construction employees, maintaining covid protocol, supplying groceries at their door steps, regularly checking up their health, sanitation has become common practice in sites.

96

మళ్లీ పాత పరిస్థితులే కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి.. కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తోంది.. మరి, నిర్మాణ సంస్థలు పాత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి కట్టుదిట్టమైన చర్యల్ని చేపడుతున్నాయి? నిర్మాణ పనులకు ఆటంకం కలగనీయకుండా ఎలాంటి ప్రణాళికల్ని రచిస్తున్నాయి? ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ నిర్మాణ రంగంలో నెలకొన్న తాజా పోకడ ఏమిటి?

తేడాది దాదాపు ఎనిమిది నెలలు.. తెలంగాణ నిర్మాణ రంగమంతా దారుణంగా దెబ్బతిన్నది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద భార్యా, పిల్లలతో నడుచుకుంటూ వెళ్లడం కళ్ల ముందే కదలాడుతున్నాయి. వాటిని ఇంకా మర్చిపోక ముందే, కరోనా సెకండ్ వేవ్ మళ్లీ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే, గతేడాది కరోనా గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ, ఇప్పుడో వ్యాక్సీన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. కొవిడ్ ను తగ్గించుకునే మంత్రం తెలిసింది. అందుకే, ఈసారి నిర్మాణ సంఘాలు పెద్దగా భయపడటం లేదు. ఈ క్లిష్ట సమయంలో కార్మికులకు, ఉద్యోగులకు అండగా నిలుస్తున్నాయి. చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

మరింత మెరుగ్గా..
గతేడాది ఆగస్టు నుంచి భవన నిర్మాణ కార్మికులు క్రమక్రమంగా పనుల్లోకి రావడం ఆరంభించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, ఈసారి మరింత మెరుగైన రీతిలో బిల్డర్లు కొవిడ్ నివారణ చర్యల్ని చేపడుతున్నారు. ‘గత అనుభవాల రీత్యా ఈసారి ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకుంటున్నాం. మరింత శ్రద్ధ పెట్టి కార్మికులు నివసించే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా ప్రయత్నిస్తున్నాం. కార్మికులకు కొవిడ్ వ్యాక్సీన్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నా’మని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్ రావు తెలిపారు. మరి, వీరంతా ఏం చేస్తున్నారంటే..

  • సైట్లలో ఆరోగ్యానికి సంబంధించిన ప్రోటోకాల్ పాటిస్తున్నారు
  • క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ లు నిర్వహిస్తున్నారు
  • నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు
  • పరిశుభ్రమైన పరిసరాలు ఉండేందుకు నిత్యం శానిటైజ్ చేస్తున్నారు
  • కార్మికుల పిల్లలకు మొబైల్ క్రెష్ ఏర్పాటు
  • సాధారణంగా భవన నిర్మాణ కార్మికులు రోజువారీ పనికెళ్లి ఇంటికొచ్చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. కాకపోతే, పని నుంచి వచ్చేశాక బయటికెళితేనే కొవిడ్ భారీన పడే ప్రమాదముంది. కాబట్టి, సైట్లలో ఉంటూ పని చేసేవారికీ అవసరమయ్యే నిత్యావసర సరుకులు, కూరగాయలు వంటివన్నీ వాళ్ల వద్దకు చేరుకునేలా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటున్నామని క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వారికి అవసరమయ్యే ఆరోగ్య సదుపాయాల్ని అందజేస్తున్నామని, కార్మికులు నివసించే సైట్లన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. దశలవారీగా భవన నిర్మాణ కార్మికులందరికీ వ్యాక్సీనేషన్ ఇచ్చేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నామని అన్నారు. ఆఫీసు స్పేసెస్ లో వందకు మించి ఉద్యోగులకు అక్కడే కరోనా వ్యాక్సీన్ ఇచ్చేందుకు కేంద్రం గత వారం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో, ఇదే నిబంధన భవన నిర్మాణ కార్మికులకు వర్తిస్తుందా అని తెలంగాణ నిర్మాణ సంఘాలు ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నాయి. ఒకవేళ నిబంధనలు అంగీకరిస్తే.. కార్మికులందరికీ వ్యాక్సీన్ ఇప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నాయి.

కార్మికులకు అండగా..
హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఎనభై శాతం బిల్డర్లకు మా సంఘానికి చెందినవారే ఉన్నారు. దాదాపు మూడు వందల మంది బిల్డర్ల వద్ద పని చేసే కార్మికులకు అవసరమయ్యే అన్ని రకాల చర్యల్ని తీసుకోవాలని మా సభ్యులకు తెలియజేశాం. వారంతా ఎప్పటిలాగే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా చూసుకుంటున్నారు. – వి. రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్ హైదరాబాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here