సీపీఎం మళ్లీ ఒంటరి పోరుకు రెడీ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన స్ట్రాటజీనే ప్రస్తుతం కూడా అవలంబించనుంది. భువనగిరి నుంచి తమ పార్టీ అభ్యర్థిగా జహంగీర్ ను బరిలోకి దింపనున్నట్టు ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఎం తెలంగాణలో కాంగ్రెస్ తో విభేదించి స్వతంత్రంగా పోటీకి దిగడం చర్చనీయాంశంగా మారింది.