Tuesday, May 13, 2025

సిఎం రేవంత్‌తో క్రికెటర్‌ ‌సిరాజ్‌ ‌భేటీ

టీమిండియా జెర్సీ బహుకరణ

టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచిన తర్వాత భారత క్రికెటర్లకు వారి వారి సొంత నగరాల్లో ఘనంగా స్వాగ తం లభిస్తుంది. తాజాగా టీమిం డియా ఫాస్ట్ ‌బౌలర్‌ ‌మహమ్మద్‌ ‌సిరాజ్‌ ‌హైద రాబాద్‌ ‌చేరుకున్న తర్వాత సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిశారు. టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచినందుకు సిరాజ్‌ ‌ను సీఎం రేవంత్‌ ‌రెడ్డి శాలువా కప్పి అభినం దించారు.

ఈ సందర్భంగా సిరాజ్‌ ‌టీమిండియా జెర్సీని సీఎం రేవంత్‌ ‌రెడ్డికి బహుకరించారు. ఈ కార్య క్రమంలో క్రికెటర్‌ అజారుద్దీన్‌, ‌మం త్రులు కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొ న్నారు. వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ ‌కప్‌ ‌ను భారత జట్టు గెలుచుకుంది. భారత జట్టుకు ఎంపికైనా 15 మంది స్క్వాడ్‌ ‌లో సిరాజ్‌ ఒక సభ్యుడు. లీగ్‌ ‌మ్యాచ్‌ ‌ల వరకు ఆడిన సిరాజ్‌ ‌సూపర్‌ 8 ‌మ్యాచ్‌ ‌లకు బెంచ్‌ ‌కు పరిమితమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్‌ ‌ల్లో ఒక వికెట్‌ ‌పడగొట్టాడు.

పొదుపుగా బౌలింగ్‌ ‌చేసి ఆకట్టుకున్నాడు. సిరాజ్‌ ‌ప్రస్తుతం జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్నాడు. వరల్డ్ ‌కప్‌ ‌తర్వాత రెస్ట్ ఇచ్చిన ఆటగాళ్లలో సిరాజ్‌ ఒకరు. ఆగస్టులో  సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు సిరాజ్‌ అం‌దుబాటులో ఉండనున్నాడు. అంతకముందు సిరాజ్‌ ‌భారత ఆటగాళ్లతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com