సుపారీ తీసుకుని డాక్టర్ పై కుట్ర చేసిన గ్యాంగ్ బాగోతం

Criminals Attack on Doctor

సుపారీ తీసుకుని ఓ డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆ హాస్పటల్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించింది ఓ కిలాడీ లేడీ . చికిత్స కోసం వచ్చిన తన పట్ల డాక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడని 15 రోజుల క్రితం ఓ మహిళ సృష్టించిన వివాదం వరంగల్ లో కలకలం రేపింది . అయితే సీసీ ఫుటేజ్ చూసిన పోలీసులు అక్కడ ఏమి లేకున్నా కావాలనే ఆ మహిళా న్యూసెన్స్ చేసిందని తెలియటంతో ఖంగు తిన్నారు. కట్ చేస్తే వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్‌ ప్రతిష్టకు భంగం కలిగించాలనే లక్ష్యంతో పధకం పన్నినట్టు తేలింది.

వరంగల్‌ బ్యాంకు కాలనీకి చెందిన కె.నాగేశ్వర్‌రావు, అతని మిత్రుడికి బాలాజీ ఆస్పత్రి డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ తో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో తన మిత్రుడి కక్షను తీర్చేందుకు నాగేశ్వర్‌రావు కుట్రకు తెర లేపాడు. ఆస్పత్రి ప్రతిష్టతో పాటు, డాక్టర్‌ పరువును దెబ్బతీసేందుకు, అతన్నితప్పు డు కేసులో ఇరికించడానికి ప్లాన్‌ వేశాడు. ఈ క్రమంలో లక్షా 50 వేలకు డీల్‌ కుదుర్చుకున్నాడు. డాక్టర్‌ సుధీర్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైతే మరో రూ.5లక్షలు ఇస్తామని రాంబాబుతో నాగేశ్వర్‌రావు ఒప్పందం చేసుకున్నాడు.ఆ తర్వాత ఏనుగులగడ్డకు చెందిన నోముల వెంకటేశ్వర్‌రావు, ఇందిరానగర్‌కు చెందిన రౌతు రాంబాబు, రాయపురకు చెందిన గడికోట కవిత, పెద్దమ్మగడ్డకు చెందిన దరిగి రాజ్‌కుమార్‌, పైడిపల్లికి చెందిన వనరస్‌ నరేశ్‌, గడికోట పాపయ్య, హైదరాబాద్‌ దమ్మాయిగూడకు చెందిన నరేశ్‌, రేవోజు సంధ్య, బత్తిని రజిత, కరీంనగర్‌కు చెందిన నల్లగొండ అమర్‌నాథ్‌ రంగంలోకి దిగారు.

ప్లాన్‌ అమలులో భాగంగా ఈ నెల 12న హైదరాబాద్‌కు చెందిన రేవోజు సంధ్య అనే మహిళ వరంగల్‌ ఎస్వీఎన్‌ రోడ్డులోని బాలాజీ ఆస్పత్రికి వచ్చింది. డాక్టర్‌ కె.సుధీర్‌కుమార్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుంది. డాక్టర్‌ చాం బర్‌లోకి వెళ్లిన తర్వాత.. తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని తెలిపింది. దీంతో డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ ఆమెను పరీక్షించడానికి ప్రయ త్నిస్తుండగా… ఆమె ఎదురుతిరిగి కేకలు వేసిం ది. బయటకు వచ్చి డాక్టర్‌ తన పట్ల అసభ్యం గా ప్రవర్తించాడని షో చేసింది. మీడియాకు వెంటనే సమాచారం వెళ్లింది. అదే సమయంలో ఆమె సంబంధీకులు ఆస్పత్రికి వచ్చి గొడవకు దిగారు. డాక్టర్‌పై దాడికి యత్నించారు. పోలీసు లు రంగప్రవేశం చేయడంతో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో మట్టెవాడ పోలీసులు కేసు విచారణ ప్రారంభించగా ఆసక్తికర విషయాలు బయటకువచ్చాయి. డాక్టర్‌ చాంబర్‌లో ఇతర వైద్యసిబ్బంది ఉండటం, సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావడంతో సంధ్య తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కూడా ఆ దిశగా విచారణ చేయడంతో కుట్ర కోణంతో పాటు తెరవెనుక పాత్రధారులు బయటకువచ్చారు. అసభ్యంగా ప్రవర్తించాడని డాక్టర్‌పై చేసిన ఫిర్యాదు బూటకమని తేలింది.కేసులో ప్రధాన నిందితుడైన నాగేశ్వర్‌రావు పరారీలో ఉన్నాడని, ఆయనను విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ జీవన్‌రెడ్డి, ఎస్సై డి.రమేశ్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు కృష్ణ, సంతో ష్‌ కీలక పాత్ర పోషించారని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article