ఫ‌స‌ల్ బీమా ప‌థ‌కాన్ని అమ‌లు చేయాలి

కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న ఫసల్ భీమా పధకం మన రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలు వల్ల జూలై మాసంలోనే గోదావరి మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ నిండాయ‌న్నారు. ఇంకా, ఆయ‌న ఏమ‌న్నారంటే.ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో వందల గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. పంట పొలాలు నీట మునకతో సోయాబీన్, పత్తి, మక్క పంటల వేర్లు కుళ్ళి పోయె పరిస్థితి ఉంది. వాగుల, నదుల పక్కన ఉన్న భూముల్లో ఇసుకమేట వేసింది, కోతకు గురి అయ్యాయి. గతంలో ఇలా జరిగినప్పుడు ప్రభుత్వం సాయం అదిస్తామని చెయ్యలేదు. ఈ సారి ఇసుకమేటలు తొలగించే భాద్యత ప్రభుత్వమే తీసుకోవాలి. కోతకు గురైన పంట పొలాలు బాగు చేసుకోవడానికి ప్రభుత్వమే ఆర్థికసాయం అందించాలి. ఇళ్లు కూలిపోయిన వారందరికీ డబుల్ బెడ్ రూములివ్వాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాన‌ని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article