యాదాద్రి:యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో సాధారణ రోజులు కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అయితే అకాల వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పునర్నిర్మాణ ఆలయం ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకున్న.. ఇంకా భక్తులకు సమస్యలు ఇబ్బందులు తీరడం లేదు. అధికారుల అలసత్వం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రతి నెలలో స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షణ చేయడం ఆనవాయితీ గిరిప్రదక్షిణం చేసే రహదారి పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్న.. రెండు నెలలు గడుస్తున్న పట్టించుకోలేదని భక్తులు వాబోతున్నారు. పరమ పవిత్రమైన యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చే భక్తులకు ఇబ్బందులు పడుతున్న అధికారులు మాత్రం ఇలాంటి చర్యలు చేపట్టడం లేదు. భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అలసత్వం వహించిన ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నార . గిరి ప్రదక్షిణం చేసి కొండపైకి వచ్చే భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గిరిప్రదక్షిణ చేసిన తర్వాత కొండపైకి వచ్చిన భక్తులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిఫారసులు, ఫైరవికార్లకు రెడ్ కార్పెట్ వేసి ఆలయంలోకి పంపుతున్నారు అధికారులు.. సామాన్య భక్తుల పరిస్థితిని పట్టించుకునే వారి కరువయ్యారు అని భక్తులు అంటూన్నారు..